వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థికి కరోనా వైరస్‌ లక్షణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2020 6:26 PM IST
వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థికి కరోనా వైరస్‌ లక్షణాలు

కరోనా వైరస్‌ లక్షణాలతో ఖాజిపేట ఎన్ఐటీ విద్యార్థి ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఇటీవల అమెరికాలో ఓ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చిన రెండు రోజుల తరువాత నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతూ.. రోహిణి ఆస్పత్రిలో చేరాడు. ప్రాథమిక పరీక్షల అనంతరం కరోనా లక్షణాలు ఉన్నాయని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం హస్పిటల్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు.

కాగా.. దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితుల్లో 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. కేరళలో 17, హరియాణా 14, ఉత్తరప్రదేశ్‌ - 11, మహారాష్ట్రలో 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 6, కర్ణాటక -4, రాజస్థాన్‌ -3, లద్ధాక్‌లో 3 కరోనా కేసులు, తెలంగాణ, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ర్టాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Next Story