మర్కజ్‌ గురించి కేంద్రానికి చెప్పింది మేమే..

By అంజి  Published on  1 April 2020 2:19 PM GMT
మర్కజ్‌ గురించి కేంద్రానికి చెప్పింది మేమే..

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి సంబంధించిన చర్యలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందన్నారు.

అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని మొదటగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది సీఎం కేసీఆరేనని అన్నారు. ఢిల్లీ మర్కజ్‌ సంబంధించి కేంద్రప్రభుత్వానికి సమాచారం అందించింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం.. భారతదేశానికి ఒక దిక్సూచి ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 100 మందికిపైగా మర్కజ్‌ వెళ్లినట్టు తెలిసిందన్నారు. వారిలో 160 మందిని తప్ప అందరీ గుర్తించామని మంత్రి ఈటల తెలిపారు. ఇంత మందిని రెండు రోజుల్లోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తున్నామంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చాన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్‌ జరగలేదని ఆయన అన్నారు.

Also Read: మా అమ్మ అంత్యక్రియలకు వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు : ఎస్సై

ఇవాళ మరో ఇద్దరు కరోనా బాధితులు డిశ్ఛార్జి అవుతున్నారని తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వారు కూడా మరో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని మంత్రి ఈటల కోరారు. అలాగే మర్కజ్‌ వెళ్లిన వారందరూ కూడా స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. కాగా మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలుసుకోవాలని ఇప్పటికే డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారని చెప్పారు.

Also Read: కరోనా: వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఐ ఫెన్‌ అదృశ్యం..

తెలంగాణలో కరోనా వైరస్‌ సోకి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు.

Next Story
Share it