కరోనా: భయం పుట్టిస్తున్న తాజా పరిశోధనలు..!

By సుభాష్  Published on  17 April 2020 5:04 PM IST
కరోనా: భయం పుట్టిస్తున్న తాజా పరిశోధనలు..!

కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. దాదాపు ఈ వైరస్‌ 200లకుపైగా దేశాల్లో విస్తరించింది. ఈ కరోనా వల్ల ఇప్పటి వరకూ 1.45 లక్షల మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 22 లక్షల మందికి ఈ వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎన్నో దేశాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. అయిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వైరస్‌పై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కాగా, కరోనాకు సంబంధించి శాస్త్రవేత్తల తాజాగా అధ్యయనం భారత్‌కు వణుకు పుట్టిస్తోంది.

ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌

వ్యక్తికి ఎలాంటి కరోనా వైరస్‌ లక్షణాలు లేకున్నా పరీక్షలో పాజిటివ్‌ వస్తోంది.

తాజా పరిశోధనలలో ఓ విషయం మరింత కలవరపెడుతోంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. ఇప్పటి వరకూ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఆ లక్షణాలున్న వారి నుంచే వ్యాపిస్తోందని ప్రచారంలో ఉంది. కానీ చైనాలో జరిగిన కొన్ని పరిశోధనల్లో సంచలన నిజం ఒకటి బయటపడింది. అసలు కరోనా లక్షణాలు కనిపించకున్నా అది శరీరంలో తిష్టవేసి ఉంటుందని, వారి నుంచి ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని వెల్లడైంది. కరోనా లేని వ్యక్తి నుంచి మరో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సోకిన రెండు, మూడు రోజుల తర్వాత కాని వైరస్‌ లక్షణాలు బయటపటం లేదని తేలినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వాస్తవాన్ని నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ వెల్లడించింది.

చైనాలోని ఓ ఆస్పత్రిలో కరోనా ఉన్న కొందరికి పరీక్షించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ పేర్కొంది. అంతేకాదు ఇలా 44 శాతం మందిలో ఈ వైరస్‌ వ్యాపిస్తోందని తెలిపింది. కాగా, చైనాలోని తియాంజిన్‌ ప్రావిన్స్‌లో 62 శాతం, సింగపూర్‌లో 48 శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్దారించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధన జరిపిన వారిలో గాంగ్‌ఝౌ మెడికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో పాటు హాంకాంగ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్‌పెక్షివస్‌ డిసీజ్‌ ఎపీడీమియోలజీ అండ్‌ కంట్రోల్‌ శాస్త్రవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక భారత్‌లో...

కాగా, భారత్‌లోనూ ఇప్పటి వరకూ కరోనా వచ్చినట్లు భావిస్తున్న అనుమానితులను మాత్రమే పరీక్షిస్తున్నారు. వీరు ఎక్కడెక్కడ ప్రయాణించారు.. ఏఏ దేశాల్లో తిరిగారు అనే దానిని కనుగొనేందుకే ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే భారత మెడికల్‌ కౌన్సిల్‌ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 మధ్య జరిపిన నిర్వహించిన ర్యాండమ్‌ పరీక్షల్లో 104 పరీక్షలు పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో 40 కేసుల్లో ఎటువంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని తేలింది. అయినా వారికి ఎలా వ్యాపించిందన్న విషయమై ఇంకా తేలాల్సి ఉంది. కాగా, ఈ పరిశోధనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Next Story