నయమైనా.. 8 రోజుల దాకా..

By అంజి  Published on  29 March 2020 9:57 AM IST
నయమైనా.. 8 రోజుల దాకా..

హైదరాబాద్‌: 'ఎనిమిది రోజుల దాకా..' అంటూ ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం మేరకు.. బాధితుడికి కరోనా ఇన్పెక్షన్‌ నయమైనా వైరస్‌ శరీరంలో కొనసాగుతోందని తెలిసింది. కొంతమందికి కరోనా ఇన్ఫెక్షన్‌ స్వల్ప స్థాయిలో ఉన్న, ఆస్పత్రిలో చికిత్స అనంతరం రోగిలో వ్యాధి లక్షణాలు తగ్గుతున్నాయి. అయితే వైరస్‌ తగ్గినా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారిలో 8 రోజుల పాటు వైరస్‌ ఉంటోందని తెలిపారు. మహమ్మారి కరోనాను నియంత్రించలేకపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి వారు పేర్కొన్నారు.

చైనాలోని పీఎల్‌ఏ ఆస్పత్రి నిపుణులు, అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన పరిశోధకుడు లోకేష్‌ శర్మ కూడా ఉన్నారు. జనవరి 28 నుంచి 9 వరకు బీజింగ్‌లోని పీఎల్‌ఏ ఆస్పత్రిలో చికిత్స పొంది 16 మంది కరోనా రోగులను శాస్త్రవేత్తలు పరిశీలించారని ఈనాడు తన కథనంలో రాసింది.

Also Read: చెట్లపై కూలీల క్వారంటైన్ – టేక్ ఏ బౌ

జ్వరం, దగ్గు, గొంతులో నొప్పి, శ్వాస ఇబ్బందులు మొదలగునవి రోగుల్లో తలెత్తాయి.. అయితే వీరికి పలు రకాల ఔషధాలతో వైద్యులు చికిత్స చేశారు. రెండు రోజుల పాటు పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ పరీక్షలు చేసి.. రోగుల్లో వైరస్‌ లేదని నిర్దారించి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత రోజు విడిచి రోజు రోగుల నమూనాలను సేకరించి శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే వ్యాధి లక్షణాలు తగ్గిన కూడా దాదాపు సగం మంది కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది.

Also Read: జొమాటో, స్విగ్గీలో కూరగాయల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్లు.!

దీన్ని బట్టి చూస్తే.. తీవ్ర స్థాయి కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారు.. ఇంకా ఎక్కువ కాలం పాటు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తుండొచ్చు అని భారత సంతతి శాస్త్రవేత్త లోకేష్‌ శర్మ చెప్పారు.

అయితే కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారు కూడా మరో రెండు వారాల పాటు తమ క్వారంటైన్‌ కాలాన్ని పొడిగించుకోవాలని, దీని ఇది ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందని శాస్త్రవేత్త లిక్సిన్‌ షీ చెబుతున్నారు.

Next Story