ప్రధాని భార్యకు కరోనా
By రాణి Published on 13 March 2020 6:06 AM GMTఎంత గొప్పవారైనా సరే..వారిని కరోనా మాత్రం వదిలిపెట్టడం లేదు. వివిధ దేశాల మంత్రులకు ఈ వైరస్ ఇప్పటికే వ్యాపించింది. అందులోనూ..రెండు దేశాల ఆరోగ్య మంత్రులకే ఈ వైరస్ రావడం గమనార్హం. రెండ్రోజుల క్రితమే బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి, ఎంపీ నదీన్ డారీస్ తనకు కరోనా వైరస్ సోకినట్లు ప్రకటించారు. తాజాగా..కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య గ్రెగొరీకి కరోనా వైరస్ సోకినట్లుగా అక్కడి ప్రధాని కార్యాలయం వెల్లడించింది. గురువారం గ్రెగొరీకి కరోనా లక్షణాలుండటంతో..ప్రధాని కూడా ఆమెతో పాటు ఇంటికే పరిమితమై అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. అయితే..వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు జస్టిన్ ట్రూడో.
Also Read : భారత్‌లో తొలి కరోనా మరణం
గ్రెగొరీ ఇటీవలే బ్రిటన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైందని..అక్కడే ఆమెకు ఈ వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రెగొరీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ వెల్లడించారు. అలాగే ప్రధాని ట్రూడో కి మాత్రం వైరస్ లక్షణాలేవీ లేవని..ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. గురువారం నాటికి కెనడాలో వైరస్ బాధితుల సంఖ్య 138కి చేరింది.
Also Read : ప్రారంభంలోనే కుప్పకూలింది.. 12 ఏళ్లలో తొలిసారి
కరోనా కారణంగా ఇప్పటికే 4వేలకు పైగా మృతి చెందగా, లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు. కాగా, పోలాండ్ భద్రతా దళాలకు చెందిన ఆర్మీ జనరల్ జారొస్లావ్ మికా కూడా రెండ్రోజుల క్రితమే కరోనా వైరస్ తో పోరాడుతున్నట్లు తెలిసింది. అలాగే హాలీవుడ్ సినీ దంపతులకు కూడా గురువారం కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణయింది. ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య నటి రిటా విల్సన్ లకు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్ర్టేలియాలోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ కోసం ఆస్ర్టేలియా వెళ్లిన ఈ జంట..కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లగా..అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా నిర్థారణయింది.
Also Read : తన మొదటి భార్య ఎవరో చెప్పిన అల్లు అర్జున్