మెగా కాంపౌండ్ లో, సినీ ఇండస్ర్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీకి..తన కూతురు అర్హ అంటే ఎంతో అమితమైన ప్రేమ. అప్పుడప్పుడూ..ఆ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కొన్ని సంభాషణలను వీడియోలు తీసి నెట్టింట్లో పెడుతుంటాడు బన్నీ. పెట్టిన కొద్దిసేపటికే..అవి వైరల్ అవుతాయంటే..అర్హకు ఈ వయసులోనే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు కదా. తన ముద్దు ముద్దు మాటలతో..బన్నీ ఫ్యాన్స్ అందరినీ తనవైపుకు తిప్పుకుంటోంది అర్హ.

Also Read : ఉగాదికి ప్రభాస్ ఫస్ట్ లుక్..

విషయానికొస్తే..బన్నీ సడెన్ గా ఒక బాంబ్ పేల్చాడు. స్నేహారెడ్డి తనకు మొదటి భార్య కాదంట. అంతకుముందే బన్నీకి పెళ్లి అయిందట. అదేనండి..సినిమాలతో అయిందని ఒకానొక సందర్భంలో చెప్పాడు. అందుకే సినిమా తన మొదటి భార్య, స్నేహారెడ్డి రెండవ భార్య అని చెప్పాడు బన్నీ.

Also Read : తిరుపతి వెళ్లిన జంట పెళ్లి చేసుకునే లోపు..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.