తిరుపతి వెళ్లిన జంట పెళ్లి చేసుకునే లోపు..

By రాణి  Published on  11 March 2020 1:08 PM GMT
తిరుపతి వెళ్లిన జంట పెళ్లి చేసుకునే లోపు..

ఒక్కోసారి మన చుట్టూ ఉన్నవారు, మనం గుడ్డిగా నమ్మిన వాళ్లే మనల్ని నిండా ముంచేస్తారు. దాదాపు ఇలాంటి అనుభవాలు చాలామంది తమజీవితాల్లో చూసుంటారు. సరిగ్గా ఓ మైనర్ బాలిక జీవితాన్ని కూడా ఆమెచుట్టూ ఉన్నవారే నాశనం చేశారు. ఐదునెలల క్రితమే ఆమె జీవిత నాశనానికి బీజం పడింది హైదరాబాద్ లో..

బంజారాహిల్స్ లోని ఓ బస్తీలో ఉండే పాతికేళ్ల యువకుడు..తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆ బాలిక తల్లిదండ్రులతో ఉంటూ..ఇంటర్ చదువుకుంటోంది. రోజూ..మంచివాడిలా నటిస్తూ..కాలేజీకి వెళ్లే ఆ యువతి వెంటపడేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా..ప్రతిరోజూ తనను ఒక అబ్బాయి ఫాలో అవ్వడం ఆమెకు బాగా నచ్చింది. తన స్నేహితురాళ్లు వాళ్ల బాయ్ ఫ్రెండ్ ల గురించి గొప్పగా చెప్తుంటే వినడమే తప్ప..తనవెంట పడినవారెవరూ లేరు. ఈ అబ్బాయి ఇలా వెంట తిరుగుతుండటంతో ఆ బాలిక కూడా తనవెంట ఒక అబ్బాయి వస్తున్నాడని ఫ్రెండ్స్ చెప్పుకుని మురిసిపోయేది. కాసేపటికి కాలేజీ రోజుల్లో ఇదంతా మామూలే అనుకుంటూ..ఎవరి ధ్యాసలో వారుండేవారు.

Also Read : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దారుణ హ‌త్య‌

చాలా రోజులుగా యువతి వెంట తిరుగుతున్న ఈ పోకిరీ..నిదానంగా ఆమెతో మాటలు కలపడం మొదలుపెట్టాడు. నీ పేరేంటి..నాతో మాట్లాడవా..నువ్వంటే నాకు చాలా ఇష్టం..ఫోన్ నెంబరివ్వా అంటూ..మాటిమాటికీ అడుగుతుండటంతో ఆ యువతి కూడా అతడిపై మొగ్గుచూపింది. అప్పట్నుంచీ ఫోన్లో కబుర్లు..బయట కలిసి మెలిసి తిరగడం..ఇలా కొద్దిరోజులు గడిచిపోయాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ యువతి అడిగినప్పుడల్లా అతడు ఊ అనేవాడు. నీతో పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోకపోతే..అని ప్రశ్నిస్తే గుడిలె పెళ్లి చేసుకుందాం అనేవాడు.

తండ్రి మందలింపుతో తిరుపతికి..

ఒక రోజు ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో కూతుర్ని మందలించాడు. మళ్లీ ఆ అబ్బాయితో తిరిగితే కాలేజీ మాన్పించి, ఇంట్లో కూర్చోబెడతా అని హెచ్చరించాడు. నాలుగురోజులు దూరంగానే ఉన్నా మళ్లీ కలిసింది. ఏంటి మాట్లాడట్లేదంటే..అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇలాగైతే మన పెళ్లి జరగదు. ఓ పని చేద్దాం. తిరుమల కొండకు వెళ్లి పెళ్లి చేసేసుకుందాం అన్నాడు. సరే అంది. అంతే.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అతనితో చెక్కేసింది.

Also Read : కీచ‌కోపాధ్యాయుడు.. మ‌న‌వ‌రాలి వ‌య‌సు పిల్ల‌లతో..

అలా ట్రైన్ ఎక్కి ఇద్దరూ తిరుపతిలోని ఓ హోటల్ లో దిగారు. అదేరోజు రాత్రి ఆమె పై బలవంతం చేశాడు. పెళ్లికి ముందే ఇలాంటివి వద్దు అని ఆ యువతి మొత్తుకున్నా వినలేదు. రేపు పెళ్లి చేసుకుంటుండగా..కొండపైనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు ఉదయం కొండపైకి వెళ్లకెళ్లకపోవడంతో..ఆ యువతే తిరుమలకు డైరెక్టుగా బస్సులుంయిగా..వాటి ద్వారా కొండపైకి వెళ్లి పెళ్లి చేసుకుందామంది. అందుకు యువకుడు కొండపైకి రేపు వెళ్దాం.. ఈ రోజు తిరుపతి చుట్టుపక్కలున్న పార్కులు, అవీ ఇవీ చూద్దాం అంటే ఒప్పుకుంది. కలిసి తిరిగారు. మళ్లీ రెండోరోజు రాత్రి కూడా అత్యాచారం చేశాడు. తర్వాతి రోజు ఆమె నిద్రలేచి చూస్తే.. అతను పక్కన లేడు. ఏమయ్యాడా అని అంతా చూసింది. ఎక్కడా లేడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

తాను మోసపోయానని గ్రహించిన ఆ బాధితురాలు తిరిగి బంజారాహిల్స్ వచ్చి జరిగిన దారుణ ఘటనను తండ్రికి చెప్పుకుని ఏడ్చేసింది. అంతకుముందు మందలించిన తండ్రి..ఈసారి మాత్రం ఏమీ అనకుండా దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ఆ దుర్మార్గుడిని మరిచిపోయి..బాగా చదువుకో అని మంచిమాటలు చెప్పాడు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు పెట్టించాడు. యువకుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it