కీచకోపాధ్యాయుడు.. మనవరాలి వయసు పిల్లలతో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 March 2020 11:17 AM GMT
ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాల అధికమవుతున్న నేఫథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నేరప్రవృత్తి మాత్రం తగ్గట్లేదు. వివరాళ్లోకెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలంలోని ఎంపీపీ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడు చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు.
మనవరాళ్ల వయసున్న చిన్నపిల్లలపైన లైంగిక దాడులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు గోపాల్ పిలై. దీంతో గ్రామస్తులు ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించారు. గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా అవార్డు అందుకున్న గోపాల్ పిలై.. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం నిజంగా సిగ్గుచేటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story