వాళ్లు అన్నంత పనీ చేశారు : ప్రణయ్ తండ్రి బాలస్వామి

By రాణి  Published on  10 March 2020 8:54 AM GMT
వాళ్లు అన్నంత పనీ చేశారు : ప్రణయ్ తండ్రి బాలస్వామి

అమృతా, ప్రణయ్ ల ప్రేమ వివాహం, ప్రణయ్ హత్యోదంతంపై ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రణయ్ హత్యకేసు ఛార్జిషీటు లో బాలస్వామి అభిప్రాయాన్ని కూడా చేర్చారు పోలీసులు. స్కూల్లో చదివేటప్పటి నుంచి అమృతా, ప్రణయ్ మంచి స్నేహితులని తెలిపారు. కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమ గా మారిందని, ఈ విషయం పసిగట్టిన అమృత తండ్రి మారుతీరావు ఆమెను వేరే స్కూల్లో చదివించారని పేర్కొన్నారు. కాగా..అమృతే తన కొడుకు ప్రణయ్ ను ప్రేమించిందని, తర్వాత ప్రణయ్ కూడా అమృతను ప్రేమించాల్సిందిగా తానే కోరిందని చెప్పారు.

Also Read :

మారుతీరావు ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

తన ప్రేమను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని అమృత బెదిరించడంతో ప్రణయ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అమృతతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుని వచ్చారన్నారు. పెళ్లి తర్వాత చాలా సార్లు అమృతను మారుతీరావు వద్దకు పంపకపోతే ప్రణయ్ ను చంపేస్తామంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. అమృత వారికి లొంగకపోవడంతో..మారుతీరావు, శ్రవణ్ కుమార్ అన్నంత పనీ చేశారని వాపోయారు. కుటుంబానికి చేదోడు, వాదోడుగా నిలవాల్సిన కొడుకుని కిరాతకంగా నరికి చంపించారని తెలిపారు.

పెళ్లైన కొన్నాళ్లకు అమృత గర్భం దాల్చగా..వైద్య పరీక్షల నిమిత్తం ప్రణయ్, అమృత, నా భార్య కలిసి మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రికి వెళ్లి..తిరిగి వస్తున్న క్రమంలో ఆస్పత్రి బయటే ప్రణయ్ ను కిరాయి హంతకులు విచక్షణా రహితంగా నరికి చంపారని తెలిపారు పెరుమాళ్ల బాలస్వామి.

Next Story