భారత్‌లో 24 గంటల్లో 1490 కేసులు
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి భారత దేశంలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1490 కేసులు నమోదు కాగా.. 56 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిసి ఇప్పటి వరకు దేశంలో 24,942 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 779 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 5210 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 18,953 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, ఇప్పటి వరకు అక్కడ 6817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 301 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 2,514, గుజరాత్ 2,815, మధ్యప్రదేశ్ 1,952,రాజస్థాన్ 2,034, తమిళనాడు 1,755, ఉత్తరప్రదేశ్ 1,778, ఆంధ్రప్రదేశ్ 1,061 కేసులు నమోదయ్యాయి.