దేశవ్యాప్తంగా 294..తెలంగాణలో 21 కరోనా కేసులు
By రాణి Published on 21 March 2020 10:11 AM GMTసామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ..మంత్రుల దగ్గర్నుంచీ..దేశాల అధ్యక్షులు, ప్రధానుల వరకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుందీ కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. ఈశాన్య దేశంలో పుట్టి..ఇప్పుడు యావత్ ప్రపంచదేశాల్ని తన గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా 294 కరోనా కేసులుంటే..వీరిలో 38 మంది విదేశీయులున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఒక మహిళకు కరోనా నిర్థారణవ్వగా..ఆమె ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా లక్షణాలుండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా మహారాష్ర్టలో 63 కరోనా కేసులు నమోదవ్వడంతో.. అక్కడి ప్రభుత్వం అన్ని ప్రధాన నగరాలను షట్ డౌన్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : అలా వద్దు.. ఇలా చేయండి..!.. ప్రధాని వీడియో మెస్సేజ్
అయితే చాలామందికి కరోనా పాజిటివ్ కేసులపై పలు సందేహాలొస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన బాధితుల అసలు సంఖ్యను చెప్పకుండా ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారికంగా 21 కేసులుంటే..అనధికారికంగా ఈ సంఖ్య దానికి రెండింతలు ఉండొచ్చన్న అనుమానం లేకపోలేదు. ఉదాహరణకు కరీంనగర్ లో 60 వేలమందికి కరోనా పరీక్షలు చేస్తే..ఇద్దర్ని మాత్రమే గాంధీకి తరలించారన్నదానిలో నిజమెంతుందో ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పేరు చెప్పకూడని ఒక ఊరిలో దాదాపు 10 కరోనా కేసులు నమోదవ్వగా..వారిలో ఇద్దరు స్థానిక డాక్టర్ల పిల్లలేనని తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఇటీవలే అమెరికా నుంచి సొంతఊర్లకు వచ్చినట్లు సమాచారం. ఒక్క తెలుగురాష్ర్టాల్లోనే కాదు. కరోనాకు కేంద్ర బిందువైన చైనాతో పాటు ఇతర దేశాలన్నీ కూడా ఇదే బాటలో ఉన్నట్లుగా అంచనా.
Also Read : ఉచితంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బుల పంపిణీ
సింగపూర్ లో కూడా ఇద్దరు కరోనా వైరస్ తో చనిపోగా..ఒక్కరే చనిపోయినట్లు చెప్పింది మీడియా. ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం వల్ల చాలా మంది కరోనా వైరస్ గురించి పట్టించుకోవడం లేదు. సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసేదే ఆ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య. ఈ సంఖ్య తక్కువగానే ఉంది కదా. మనకేం కాదులే. పెరిగినపుడు చూద్దాం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ప్రజలు భయపడతారని అసలు లెక్కలు కాకుండా..వాటిని తారుమారుచేసి లెక్కలు చూపిస్తే..దాని ప్రభావం ఖచ్చితంగా ప్రజలపైనే పడుతుందనడంలో సందేహం లేదు.