ఉచితంగా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బుల పంపిణీ

కరోనాను అడ్డుకునేందుకు యావత్ దేశం సంసిద్ధమవుతున్న తరుణంలో నిత్యావసర వస్తువులను తయారు చేసే కంపెనీలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. విపత్కర సమయంలో తమ బాధ్యతను గ్రహించి..ప్రజలకు మేలు చేయాలని నిర్ణయించుకున్న వివిధ సబ్బుల తయారీ సంస్థలు. సబ్బులతో పాటు శానిటైజర్ ఉత్పత్తులను పెంచడంతో పాటు వాటి ధరలను మధ్యతరగతివారికి అందుబాటులో ఉండేలా తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.

Also Read : నో షేరింగ్ ఇన్ ఉబర్, ఓలా క్యాబ్స్

ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్ యూఎల్) కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకై రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. లైఫ్బ బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్ వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరలను 15 శాతం తగ్గిస్తున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. తక్షణమే వీటన్నింటినీ ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలోనే ఇవి మార్కెట్ లోకి వస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరమైన ప్రాంతాల్లో 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బుల్ని ఉచితంగా పంచనున్నట్లు వెల్లడించింది.

Life Boy Sanitizers

Also Read : ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి

ఇక పతంజలి గోద్రేజ్ లు సైతం హెచ్ యూఎల్ బాటలోనే పయనిస్తున్నాయి. అలోవెరా, హల్దీ – చందన్ సబ్బుల ధరలను 12.5 శాతం తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి S.Kతిజరావ్లా ప్రకటించారు. కాగా..ఇటీవల కాలంలో ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది గోద్రేజ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ భారాన్ని వినియోగదారులపై వేయాలని తాము భావించడం లేదని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఈఓ సునీల్ కటారియా వెల్లడించారు.

Also Read : ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనుకోకండి..ప్రాణాలు పోతాయ్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *