దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఉబర్, ఓలా క్యాబ్స్ సర్వీస్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా పూల్ రైడ్ లేదా పూల్ సర్వీస్ సదుపాయాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ఈ క్యాబ్ సర్వీస్ సంస్థలు తెలిపాయి. కరోనా వైరస్ అదుపులోకి వచ్చేంతవరకూ ఒక కారులో ఒకరు లేదా..ఒక కుటుంబానికి మాత్రమే ప్రయాణించాలి. స్నేహితులు, బయటి వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణించడంపై నిషేధాన్ని అమలు చేశాయి.

Also Read : ఏపీలో పెట్రోల్ బంక్ లు మూసివేత

కొద్దిరోజులుగా కరోనా ప్రభావంతో పూల్ సర్వీస్ లకు డిమాండ్ బాగా తగ్గిపోయిందని పేర్కొన్నాయి ఈ రెండు సంస్థలు. క్యాబ్ కస్టమర్లు తమ ప్రయాణాన్ని ఇతరులతో కలిసి చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదని, అందుకే పూల్ రైడ్ ను రద్దుచేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వం సూచనలతో ప్రజలు బయటికి రావట్లేదని..తత్ఫలితంగా క్యాబ్ లకు డిమాండ్ బాగా తగ్గినట్లు పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Also Read : ఉచితంగా శ్రీవారి లడ్డూలు..

రాణి యార్లగడ్డ

Next Story