ఏపీలో పెట్రోల్ బంక్ లు మూసివేత

By రాణి  Published on  21 March 2020 6:53 AM GMT
ఏపీలో పెట్రోల్ బంక్ లు మూసివేత

కరోనా ఉధృతి దృష్ట్యా ప్రధాని నరేంద్రమోదీ మార్చి 22, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. అలాగే ఆంధ్రా నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు సైతం రద్దయ్యాయి. ఢిల్లీలో మెట్రో సర్వీలు నిలిచిపోనున్నాయి. ఇత మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మాల్స్, షోరూమ్ లు మూతపడనున్నాయి. తెలంగాణలో కూడా పెట్రోల్ బంక్ లను మూసివేయడంపై పెట్రోల్ బంక్ ల యాజమాన్యాలు సమావేశమయ్యాయి. మరికొద్దిసేపటిలో ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రానుంది.

Also Read : ఉచితంగా శ్రీవారి లడ్డూలు..

హైదరాబాద్ లో మెట్రో రైళ్ల నిలిపివేతపై ప్రభుత్వం ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మెట్రో రైళ్ల నిలిపివేతపై ప్రకటన చేయనున్నారు. ఈ అర్థరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోనున్నాయి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం నాన్ వెజ్ అమ్మకందారులు కూడా తమ షాపులను మూసివేయనున్నారు. కూరగాయల మార్కెట్లు కూడా మూతపడనుండటంతో..పెట్రోల్ బంక్ లు, మార్కెట్లలో రద్దీ బాగా పెరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకూ 19 కేసులు నమోదవ్వగా, ఏపీలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read : సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా.. కారణం ఇదే

Next Story
Share it