సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా.. కారణం ఇదే

By సుభాష్  Published on  21 March 2020 6:01 AM GMT
సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా.. కారణం ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం శనివారం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పర్యటించాల్సి ఉండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్య సిబ్బంది తమ పని తాము చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే వాయిదా వేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో వ్యాధి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌లో పర్యటించాలని ముందుగా భావించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన కారణంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించేందుకు పర్యటన ఖరారు కాగా, శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ఉండటంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. ఇప్పుడు శనివారం పర్యటన కూడా వాయిదా పడింది.

కాగా, తెలంగాణలో నిన్న మరో ముగ్గురికి కరోనా పాటిజివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా మరో కేసు నమోదైంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరుకుంది.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 200లకు దాటిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ కారణంగా ఎన్నో చర్యలు చేపట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 11వేలకు చేరుకుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ .. మృతుల సంఖ్య మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో ఇటలీ ఉండేది. తాజాగా చైనాను దాటేసి ఇటలీ చేరుకుంది. ఇప్పుడు కరోనా మృతుల సంఖ్యలో మొదటి స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ 4వేలకు పైగా మృతుల సంఖ్య నమోదైంది.

Next Story