ముఖ్యాంశాలు

  • ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థి శ్రీహర్ష
  • కరోనా లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిక
  • హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలింపు

మంచిర్యాల జిల్లాలో కరోనా అనుమానిత కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మంచిర్యాలకు చెందిన యువకుడు తీవ్ర దగ్గు, జ్వరం, జలుబుతో ఇవాళ మధ్యాహ్నం స్థానిక ఆస్పత్రిలో చేరాడు. యువకుడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కరోనా లక్షణాలుగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాడు. శ్రీహర్ష.. ఇటలీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. గత 12 రోజుల క్రితం శ్రీహర్ష ఇంటికి వచ్చాడు. ఇటలీ నుంచి వచ్చిన తర్వాత శ్రీహర్ష అనారోగ్యానికి గురయ్యాడు. శ్రీహర్షకు కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో.. అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కరోనాను అరికట్టేందుకు..టీటీడీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కేంద్రం కరోనా టెర్రర్ పై హై అలర్ట్ ప్రకటించడంతో..ఇప్పటికే తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ రెండు రాష్ర్టాల్లోనూ స్కూళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. అలాగే ఈ నెలాఖరు వరకూ థియేటర్లన్నీ మూగబోనున్నాయి. రాజస్థాన్ లో విద్యాసంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి.

Also Read: ‘కరోనా’ అంటూ ఆఫీసుకు డుమ్మా.. ఉద్యోగికి 3 నెలలు జైలు

తాజాగా..టీటీడీ కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించడంలో భాగంగా..భక్తులు క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే పద్ధతికి టీటీడీ తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.