ఏపీలో విజృంభిస్తున్న కరోనా
By Newsmeter.Network Published on 5 April 2020 11:37 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతుంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఫలితంగా భారత్‌లో 24గంటల్లోనే 472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణలో 272 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం వరకు 18 పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 226కు చేరింది. నాలుగు రోజులుగా భారీగా కరోనా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుంది. కరోనా లక్షణాలున్న వారిని ఐసోలేషన్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.
Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…
తాజాగా ఆదివారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే.. శనివరాం రాత్రి 9గంటల వరకు 192 పాజిటివ్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఆదివారం ఉదయం 9గంటల వరకు మరో 34 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఒంగోలులో రెండు, చిత్తూరులో ఏడు, కర్నూల్‌లో 23, నెల్లూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లాలో కొద్ది గంటల్లోనే 23 పాజిటివ్ కేసులు రావటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇండ్ల ఏరియాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించగా, పరిసర ప్రాంతాల ప్రజలను క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు.
Also Read : దేశంలో కరోనా బాధితులు అధికశాతం యుక్త వయస్సువారే! ఎందుకలా?
జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం -3, చిత్తూరు - 17, తూర్పు గోదావరి -11, గుంటూరు -30, కడప - 23, కృష్ణా - 28, కర్నూలు - 27, నెల్లూరు - 34, ప్రకాశం - 23, విశాఖపట్టణం - 15, పశ్చిమ గోదావరి - 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.