దేశంలో కరోనా బాధితులు అధికశాతం యుక్త వయస్సువారే! ఎందుకలా?

By Newsmeter.Network  Published on  5 April 2020 5:28 AM GMT
దేశంలో కరోనా బాధితులు అధికశాతం యుక్త వయస్సువారే! ఎందుకలా?

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా రోజురోజుకు కరోనా వ్యాపిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్‌ సోకి ఇప్పటికే 3374 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 267 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు 77 మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధికులు వృద్ధులేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 181 దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. అమెరికా లాంటి అగ్రదేశాలతో పాటు చైనా, ఇటలీ, బ్రిటన్‌ వంటి దేశాల్లోనూ రోజురోజు ఈ వ్యాధి విజృంభిస్తుంది. ప్రపంచంలో అత్యధికశాతం కరోనా భారిన పడుతుంది 50ఏళ్ల పైబడిన వారే ఉంటున్నారు. కానీ భారత దేశంలో మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.

Also Read :లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పిన లెక్కల ప్రకారం భారత దేశంలో అధికశాతం యుక్త వయస్సువారికే కరోనా వ్యాపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వైరస్‌ భారిన పడుతున్న వారిలో 83శాతం 60 ఏళ్లలోపు వారే కావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరిలో 20ఏళ్లలోపు వారు 9శాతం మంది ఉండగా, 21 నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 42శాతం మంది కరోనా బాధితులుగా ఉన్నారు. ఇక 41 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు 33శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక 60ఏళ్ల లోపు వారు మాత్రం 17శాతమేనని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోని 60శాతం మంది కరోనా బాధితుల్లో 20 నుంచి 49ఏళ్ల వయస్కులు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

కరోనా వైరస్‌ రోగనిరోధ శక్తి కలిగిన వారిని తొందరగా సోకదని వైద్యులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే 20 నుంచి 45 ఏళ్ల వయస్సులో ఉన్నవారు కొంత బలంగా ఉండటం, వారిలో రోగ నిరోధక శక్తి కలిగిఉండటం సాధారణం. 55ఏళ్ల పైబడిన వారిలో వారు తీసుకొనే ఆహారాన్ని బట్టి కొందరికి మినహా ఎక్కువ మందికి రోగనిరోధ శక్తి తక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ ఎక్కువగా 55ఏళ్ల పైబడిన వారిని ఎటాక్‌ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి విచిత్రంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం భారత్‌లో 77 మంది కరోనా వైరస్‌ భారినపడి మృతిచెందగా.. వీరిలో ఎక్కువ మంది మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధులే ఉన్నారని అగర్వాల్‌ తెలిపారు.

Next Story