అయోధ్యలో కరోనా కలకలం
By తోట వంశీ కుమార్
అయోధ్యలో కరోనా కలకలం రేపుతోంది. ఆగస్గు 5వ తేదీన అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో అక్కడ కరోనా కలకలం సృష్టించింది. అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారి సహాయకుడు ప్రదీప్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. అంతేకాకుండా అక్కడ భద్రతా విధులు నిర్వర్తించే పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. వారిలో 16 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఆగస్టు 5న జరగబోయే రామ మందిర భూమి పూజ నేపథ్యంలో అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా దాదాపు 200 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా కలకలం రేగడంతో.. అక్కడి పూజారులు, పోలీసులు ఆందోళనలకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు.. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.