భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 52,123 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 5:47 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 52,123 కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,123 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 775 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కరోనా కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కి చేరింది.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 10,20,582 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,28,242 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 34,968 మంది మరణించారు. నిన్న 4,46,642 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించారు. కరోనా రికవరీ రేటు 64.51శాతంగా ఉండగా.. మరణాల రేటు 2.23శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

Next Story
Share it