చైనాను మళ్లీ వణికించడం మొదలుపెట్టిన కరోనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jun 2020 5:34 AM GMT
చైనాను మళ్లీ వణికించడం మొదలుపెట్టిన కరోనా..!

ప్రపంచం మీదకు కరోనా వైరస్ ను వదిలి.. చైనా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా చైనాను కరోనా వైరస్ మరోసారి వణికించడం మొదలుపెట్టింది. ఆదివారం నాడు చైనాలో 57 కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెల తర్వాత ఇన్ని కేసులు చైనాలో నమోదవ్వడం తొలిసారి.

కరోనా వైరస్ మొదట ప్రబలినప్పుడు లాక్ డౌన్ ను చైనా పకడ్బందీగా అమలు చేసింది. దీంతో కరోనా మహమ్మారిని చాలా వరకూ కట్టడి చేయగలిగారు. తాజాగా వైరస్ మరోసారి ప్రబలుతూ ఉండడంతో అక్కడి అధికారులు నిఘా పెట్టారు. సౌత్ బీజింగ్ లోని కూరగాయల, మాంసం మార్కెట్ కారణంగా కరోనా విపరీతంగా పెరుగుతోందని అనుమానిస్తూ ఉన్నారు. 36 కేసులు అక్కడి నుండి ప్రబలినవే అని నేషనల్ హెల్త్ కమీషన్ చెబుతోంది. నార్త్ ఈస్ట్రన్ లియానింగ్ ప్రావిన్స్ లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయని.. బీజింగ్ కేసులతో వీరి కాంటాక్ట్ అవ్వడంతో కరోనా వాళ్లకు కూడా సోకిందని హెల్త్ అఫీషియల్స్ తెలిపారు.

దీంతో మార్కెట్ కు దగ్గరలోని ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేశారు. 11 రెసిడెన్షియల్ ఎస్టేట్స్ ను మూసివేయించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. గత రెండు నెలల్లో బీజింగ్ లో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.

మాస్కులు, గ్లోవ్స్ తో వందలమంది పోలీసులు, పారామిలటరీ దళాలు మార్కెట్ లోకి ప్రవేశించడం చూశామని అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. మార్కెట్ ను క్లోజ్ చేయడం ద్వారా నగరానికి ఫుడ్ సప్లై ఎక్కడ తగ్గుతుందోనని అధికారులు ఆందోళలన చెందుతున్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాలలోని మార్కెట్ల విషయంలో కూడా అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మాంసం, ఫిష్, పౌల్ట్రీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్కెట్ కు దగ్గరలోని తొమ్మిది స్కూల్స్, కిండర్గార్టెన్ లను అధికారులు మూసివేయించారు. క్రీడలను, గ్రూపులుగా కూర్చుని తినడాన్ని, గ్రూపులుగా టూర్ లకు వెళ్లడాన్ని కూడా ప్రస్తుతం నిలిపివేశారు. ఇతర దేశాల నుండి చైనాలోకి వస్తున్న వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపించాయని అంటున్నారు.

Next Story