పెళ్లికి వెళ్లాలంటే టెస్టు.. ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే.. ఎక్కడంటే?
By సుభాష్ Published on 29 July 2020 6:47 AM GMTఅనుకుంటాం కానీ.. అధికారుల పుణ్యమా అని.. కొన్నిచోట్ల కొన్ని నిబంధనలు అమలవుతాయి. రూల్ బుక్ లో అలాంటివి లేవే అన్న అనుమానం కలిగినా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేస్తున్నామంటే మాట్లాడలేని పరిస్థితి. దేశంలోని మరే రాష్ట్రం నుంచైనా ఎంచక్కా తెలంగాణ రాష్ట్రానికి రావొచ్చు. ఎవరూ ఎలాంటి చెకింగ్ లు చేయరు. కానీ.. తెలంగాణ నుంచి కొన్ని రాష్ట్రాలకు వెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తప్పనిసరి.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అమలవుతున్న సిత్రమైన నిబంధనలు ఆసక్తికరంగా మారాయి. ఒకందుకు ఇలాంటి నిబంధనలు మంచివే అయినా.. కొన్ని జిల్లాల్లో మాత్రమే అమలు కావటం.. అన్ని జిల్లాల్లోనూ అమలైతే మరింత మంచి ఫలితాలు ఏర్పడుతాయన్న మాట వినిపిస్తోంది. శ్రావణం అంటేనే.. శుభకార్యాలు.. మరి ముఖ్యంగా పెళ్లిళ్ల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎండల చిరాకు తగ్గి.. ఆషాఢం వెళ్లిపోయాక వచ్చే శ్రావణంతో ఒకలాంటి సందడి మొదలవుతుంది.
అన్ని చోట్లకు తగ్గట్లే తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతం నడుస్తున్న కరోనా కారణంగా కొన్ని జిల్లాలకు చెందిన అధికారులు తీసుకున్న నిర్ణయాలతో పెళ్లిళ్లకు హాజరు కావాలంటే ఆధార్ కార్డు తీసుకు వెళ్లాల్సిందేనన్న రూల్ పెట్టారు. నిజానికి పెళ్లికి వచ్చే అతిధులకు ఇబ్బందికి గురి చేసినట్లుకనిపించే ఈ రూల్ అంతర్యం మంచిదే. రేపొద్దున్న పెళ్లికి వచ్చిన వారిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు తేలితే.. వెంటనే.. మిగిలిన వారిని ట్రేస్ చేయటం గంటల్లో పూర్తి చేయొచ్చు.
పెళ్లికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలన్న నిబంధన కొన్ని జిల్లాలకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే ప్రభుత్వ పాలసీగా మారిస్తే మరింత మంచిది. కరోనా కాలంలో వైరస్ కట్టడికి ఉపయోగపడుతుంది. ఇదే కాదు.. పెళ్లికి హాజరయ్యే వారు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అమలవుతోంది. నిజానికి ఇది కూడా చాలా మంచి నిర్ణయమే. ఎంత తక్కువమంది హాజరవుతున్నారనుకున్నా ఒకేచోట కొంతమంది కలిసే చోట.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టెస్టు చేసి.. ఫలితం నెగిటివ్ గా వచ్చినోళ్లను అనుమతి ఇవ్వటం వైరస్ వ్యాప్తికి చెక్ పెడుతుందని చెప్పక తప్పదు. ఇలాంటివి కొన్ని జిల్లాలకు పరిమితం కాకుండా.. అన్ని చోట్ల అమలు చేస్తే అందరికి మంచిదని చెప్పక తప్పదు.