కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

By రాణి  Published on  26 March 2020 8:13 AM GMT
కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

ముఖ్యాంశాలు

  • 20 లక్షల వైద్య బృందాలకు హెల్త్ ఇన్సూరెన్స్
  • వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు ఎక్స్ గ్రేషియా
  • ఉజ్వల స్కీమ్ లో సిలిండర్లు ఉచితం
  • ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త
  • ఉపాధి హామీలకు కూలీ పెంపు

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ అయింది. ఈ నేపథ్యంలో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికోసం కేంద్రం కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యాహ్నం కరోనా ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియాకు వివరించారు.

Also Read : విమర్శలు కాదు.. ఎంత త్వరగా రెస్పాండ్‌ అయ్యామో చూడాలి

కరోనాతో ఉపాధి కోల్పోయిన వారందరికీ కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రకటించారు. పేదలకు నేరుగా ఈ సహాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. దేశ ప్రజల కోసం కేంద్రం రూ.1 లక్ష 70 వేల కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. గరీబ్ కల్యాణ్ స్కీమ్ పేరుతో ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు లాభ పడనున్నారు. దేశ ప్రజల ఆకలి కేకలను తీర్చేందుకే కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటిస్తుందన్నారు.

Also Read : రూ.1500 కోసం రూ.500

కరోనాతో పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నామన్నారు. అలాగే 80 కోట్ల మంది పేదలకు రేషన్ కాకుండా అదనంగా ప్రతినెలా 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కందిపప్పు అందిస్తామన్నారు. ఇలా మూడు నెలలకు సరిపడా రేషన్ అందజేస్తామన్నారు. ఉపాధి కోల్పోయిన వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తామని తెలిపారు. వలస కార్మికులను కూడా కేంద్రం ఖచ్చితంగా ఆదుకుంటుందన్నారు.

Also Read : ఆ వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేసారో మీ ప‌ని ఖ‌తం..

అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మంది మహిళా జన్ ధన్ ఖాతాదారులకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు ఎక్స్ గ్రేషియా, 8.69 కోట్ల రైతులకు ఇచ్చే కిసాన్ యోజన సొమ్ములో ప్రస్తుతం రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2000 జమ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఉజ్వల స్కీమ్ పరిధిలో ఉన్న మహిళలకు వచ్చే మూడు నెలలు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. 7 కోట్ల స్వయం సహాయక బృందాలకు రూ.20 లక్షల వరకూ రుణాలిచ్చే వెసులుబాటును కల్పించారు. ప్రస్తుతం ఇచ్చే పెన్షన్లు కాకుండా 60 ఏళ్లు పై బడిన వితంతువులు, దివ్యాంగులకు అదనంగా రూ.1000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న 3 కోట్ల వృద్ధులకు కూడా అదనపు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.15 వేల లోపు జీతం ఉన్నవారికి 3 నెలల పాటు 24 శాతం ఈపీఎఫ్ ను కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు నిర్మలా సీతారామన్. ఉపాధి హామీల రోజు వారీ కూలీను రూ.182 నుంచి రూ.202 కు పెంచారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.30 వేల కోట్లను వాడుకోవచ్చు.

Next Story