గాంధీలో క‌రోనా సోకిన గ‌ర్బిణీకి డెలివ‌రీ చేసిన వైద్యులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 2:07 PM GMT
గాంధీలో క‌రోనా సోకిన గ‌ర్బిణీకి డెలివ‌రీ చేసిన వైద్యులు

క‌రోనా వైర‌స్ పోరులో డాక్ట‌ర్లు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సేవ చేస్తున్నారు. ఓ వైపు క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూనే అత్య‌వ‌స‌ర సేవ‌ల్లోనూ పాలుపంచుకుంటున్నారు. గాంధీ ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం క‌రోనా సోకిన గ‌ర్భిణీ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. గ‌ర్భీణికి క‌రోనా సోక‌డంతో వైద్యులు ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుని డెలివ‌రీ చేశారు. ప్ర‌స్తుతం త‌ల్లీ బిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక త‌ల్లి బిడ్డ‌లు ఆరోగ్యంగా ఉండ‌డంతో.. డెలివ‌రీ చేసిన డాక్ట‌ర్లును ప‌లువురు అభినందించారు.

కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 10 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 1132 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ రోజు 34 మంది ఆస్ప‌త్రి డిశ్చార్జి కాగా.. 376 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story