హైదరాబాద్‌: తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవల 54 ఏళ్ల వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతన్ని వెంటనే ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే మృతుడికి ఆన్‌కంట్రోల్డ్‌ డయాబెటిస్‌, సీఓపీడీ, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు ఉన్నాయి. దీంతో అతని రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించింది. బుధవారం ఉదయం కరోనాతో పోరాడుతూ బాధితుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ తెలిపారు.Also Read: అర్థరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్‌

తమిళనాడులో తొలి కరోనా మరణంతో.. దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 11కి చేరింది. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 566 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 40 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

Also Read: స్పెయిన్‌ ఆస్పత్రుల్లో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు..

భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ లాక్‌డౌన్‌ను ఎంత కఠినంగా అమలు చేస్తే.. అంత సమర్థంగా ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు నివారణ తప్పు.. మందులు లేవు.

అంజి

Next Story