హైదరాబాద్‌ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  7 April 2020 7:51 AM IST
హైదరాబాద్‌ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌ పోలీసు విభాగంలో ఓ కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా లక్షణాలున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ స్టేషన్‌లో పని చేస్తున్న 12 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌లో పని చేస్తే ఈ కానిస్టేబుల్‌కు కోవిడ్‌ లక్షణాలు బయటపడటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఇటీవల భద్రాది జిల్లా కొత్తగూడెంలో డీఎస్పీగా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన కొడుకు లండన్‌ నుంచి తిరిగి రాగా, ఆయనతో పాటు డీఎస్పీకి కూడా కరోనా సోకింది. తెలంగాణ పోలీసు విభాగంలో నమోదైన తొలి కరోనా పాజిటివ్‌ నమోదైంది.

ఇక సోమవారం రాత్రి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 364కు చేరింది. వీరిలో 45 మంది పూర్తిగా కోలుకున్నారని, 11 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 308 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో రెండు రోజుల్లో మర్కజ్‌ కేసులతో లింకులున్న వారందరికి పరీక్షలు పూర్తవుతాయని తెలిపింది. మరో 110 పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. కాంటాక్ట్‌ కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఇక ముందుగా కరోనా కేసులు మామూలుగానే ఉండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని అనుకునే లోపే ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. అప్పటి వరకు కరోనా కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివే కాగా, తర్వాత కాంటాక్ట్‌ కేసులు అధికంగా పెరిగిపోయాయి. ఈ కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కాగా, ఢిల్లీ ఘటన నేపథ్యంలో ర్వాత అన్ని జిల్లాలకు అంటుకుంది.

Next Story