దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికి రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒకే భ‌వ‌నంలో 44 మందికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో అంతా ఉలిక్కి ప‌డుతున్నారు.

ఢిల్లీలోని కాపస్ హీరాలో ఏప్రిల్ 19న ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ వ్య‌క్తిని వెంట‌నే ఆస్ప‌త్రికి పంపి.. ఆ వ్య‌క్తి నివ‌సించే భ‌వ‌నంలోని పాలు అమ్మే వ్య‌క్తి, కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తితో పాటు ఆ భ‌వ‌నంలో నివ‌సిస్తున్న వారందిరితో పాటు ఆ ఏరియాలో మ‌రికొంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం 350 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 70 మంది రిపోర్టులు వచ్చాయి. ఆ 70 మందిలో 44 మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. వారంతా ఓకే అపార్టుమెంట్‌కు చెందిన వారు. ఇంకా మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. వారంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు అధికారులు. మిగిలిన రిపోర్ట‌లు కోసం ఎదురుచూస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.