దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు అయ్యాయి. 2,293 కొత్త కేసులు న‌మోదు కాగా.. 71 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్త కేసుల‌తో క‌లిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 37,336కి చేర‌గా.. 1,218 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 9,950 కోలుకుని డిశ్చార్జి కాగా.. 26,167 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా.. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగ‌తి తెలిసిందే. మే 4 నుంచి మే 17 వ‌ర‌కు మెట్రో, విమాన‌, రైల్వే స‌ర్వీసులపై నిషేదం కొన‌సాగ‌నుంది. గ్రీన్‌, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విజ‌భించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో కొన్ని సడ‌లింపులు ఇవ్వ‌గా.. రెడ్ జోన్‌లో మాత్రం ఎలాంటి స‌డ‌లింపులు ఇవ్వ‌లేదు

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.