వెరైటీ పెళ్లి: నాలుగు నిమిషాల్లోనే మూడు మూళ్లు

By సుభాష్  Published on  6 April 2020 9:41 AM GMT
వెరైటీ పెళ్లి: నాలుగు నిమిషాల్లోనే మూడు మూళ్లు

పెళ్లి అనగానే కొన్ని రోజుల ముందు నుంచే హడవుడి.. షాపింగ్స్‌, వెడ్డింగ్‌ కార్డులు, ఇతర కార్యక్రమాలు అలా ఎన్నో ఉంటాయి. ఇక పెళ్లి రోజు కూడా ఎంతో ఆడంబరంగా ఎంతో మంది అతిథులు తరలివస్తారు. వేదమత్రాలు, బంధువుల కోలహాల మధ్య కొన్ని గంటల పాటు జరుగుతుంది పెళ్లి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ఓ పెళ్లి మాత్రం వెరైటిగా జరిగిపోయింది. కొందరేమో వైరస్‌కు సవాల్‌ చేస్తూ మూడుముళ్లు వేసేందుకు రెడీ అంటుంటే..ఈ పళ్లి మాత్రం నలుగురి మధ్య నాలుగు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఇలాంటి పెళ్లి ఆదివారం కర్ణాటకలోని మైసూర్‌లో చోటు చేసుకుంది.

నగరంలోని గోకులంలో ఉన్న గణపతి దేవాలయంలో ఓ సివిల్‌ ఇంజనీర్‌ సోనియా.. ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ పరుశూరామ్‌కు కరోనా వైరస్‌ రాకముందే పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 17వ తేదీన ముహూర్తాన్ని నిశ్చయించారు పండితులు. కరోనా కారణంగా ఇక ఆలస్యం కాకూడదని ఆదివారమే ఇరువురి తల్లిదండ్రుల మధ్య మాంగల్యం తంతునానేనా అనిపించుకున్నారు ఈ వధు, వరుడు. పెళ్లి కళ లేకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నా.. కరోనా కారణంగా ఇలా కానిచ్చేశామని చెబుతున్నారు ఈ కొత్త జంట.

Next Story