కరోనా వైరస్‌ పేరు చెబితేనే ఒక్కొక్కరు వణికిపోతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌, చైనా, జర్మని, ఇరాన్‌ ఇలా ఏ ఒక్క దేశాన్ని వదలకుండా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ వైరస్‌నుండి ప్రజలను కాపాడేందుకు ఆయా దేశాల అధినేతలు లాక్‌డౌన్‌ను విధించారు. ఇదే తరహాలోనూ కరోనా నిర్మూలనకు భారత్‌లోనూ లాక్‌ డౌన్‌ను విధించారు. సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైద్యుడు తమ కుటుంబానికి తన ద్వారా ఈ వైరస్‌ ఎక్కడ వ్యాపిస్తుందోనని ఇంటికెళ్లడే మానేశాడు. కారులోనే తన జీవనం సాగిస్తున్నాడు. తినడం, పడుకోవటం అంతా కారులోనే.

Also Read :జైషే మహ్మద్‌ కమాండర్‌ను హతమార్చిన భారత సైన్యం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వైద్యుడు కరోనా రోగులకు సేవలందిస్తున్నాడు. అయితే ఇప్పటికే పలువురు వైద్యులు వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ వైరస్‌ భారిన పడుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు ఈ వైరస్‌ వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భోపాల్‌కు చెందిన వైద్యుడు డా. సచిన్‌ నాయక్‌ వినూత్నంగా ఆలోచించాడు. జిల్లా ఆస్పత్రిలో వైరస్‌ సోకిన వారికి వైద్యం అందిస్తున్న ఆయన.. పది రోజుల కిందటే ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. ఇంటికి పోతే కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందోననే భయంతో.. తన కారును తన నివాసంగా మార్చుకున్నాడు. అవసరమైన వస్తువులన్నీ అందులో ఉంచి.. ఆస్పత్రి ప్రాంగణంలో కారును ఉంచాడు. తన విధులు పూర్తికాగానే.. ఆస్పత్రిలోనే స్నానం చేసి రావడం, కారులోనే తినడం, పడుకోవటం చేస్తున్నాడు. దీంతో ఈ వైద్యుడి తీరును చూసిన స్థానిక ప్రజలు, తోటి వైద్యులు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యుడు సచిన్‌ నాయక్‌ తీరు పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ చౌహాన్‌ ప్రశంసించారు. సచిన్‌ మీ సేవలకు సలాం అంటూ తన ట్వీట్‌లో కొనియాడారు.

 

Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్‌

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్