జైషే మహ్మద్‌ కమాండర్‌ను హతమార్చిన భారత సైన్యం

By సుభాష్  Published on  9 April 2020 2:10 AM GMT
జైషే మహ్మద్‌ కమాండర్‌ను హతమార్చిన భారత సైన్యం

ప్రస్తుతం కరోనా వైరస్‌ ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, మరో వైపు జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మాత్రం మారడం లేదు. ఇటీవల భారత సైన్యం 9 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఇక జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ ప్రాంతంలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ కమాండర్‌ సాజద్‌దార్‌ హతమయ్యాడు. మృతదేహం వద్ద ఏకే47 రైఫిల్‌, మూడు ఏకే మ్యాగజైన్లు, అలాగే 59 రౌండ్ల తూటాలు లభ్యమైనట్లు డీఐజీ సులేమాన్‌ చౌదరి తెలిపారు.

కాగా, సోపోర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 22 రాష్ట్రీయ రైఫిల్స్‌, సోపోర్‌ పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ జవాన్లు కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ కాల్పులు జరిగాయి. అలాగే ఇటీవల జమ్మూలోని బత్‌పోర ఏరియాలో కూడా భారీగానే ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రంగంలోకి దిగిన బలగాలు 9 మందిని హతమార్చాయి.

Next Story