కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్ దిశగా అన్ని రాష్ట్రాలు

By Newsmeter.Network  Published on  23 March 2020 5:14 AM GMT
కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్ దిశగా అన్ని రాష్ట్రాలు

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచలోని పలు దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే 14,650 మంది మృతిచెందగా, మూడున్నర లక్షల మంది కరోనా వైరస్‌ భారిన పడి చికిత్సపొందుతున్నారు. మరోవైపు భారత్‌లోనూ కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంది. ఆదివారం వరకు 396 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ఈ జనతా కర్ఫ్యూలో ప్రతీ ఒక్కరూ పాల్గొన్నారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాలేదు. ఇండ్లకే పరిమితమయ్యారు.

Read also : లాక్‌ డౌన్‌లు కాదు.. ముందు అలా చేయండి – ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఇదిలాఉంటే రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈనెల 31వరకు ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ బస్సుల రాకపోకలపై నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలను లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవసరమైతే అన్ని జిల్లాలను లాక్‌ డౌన్‌ చేయొచ్చని రాష్ట్రాలకు కేంద్ర సూచించింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి. మార్చి 31వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రజలకు సూచించారు.

Also Read :అమాంతం పెరిగిన కూర‌గాయ‌ల రేట్లు.. నింగినంటిన ట‌మాట‌, మిర్చి ధ‌ర‌లు

వీరితో పాటు రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీగఢ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మధ్య ప్రదేశ్‌లో 20 జిల్లాలను, యూపీలో 15 జిల్లాలను లాక్‌ డౌన్ చేశారు. బెంగాల్‌లోనూ కోల్‌కతా సహా పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలు అదే బాటలో పయణించేందుకు సిద్ధమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరాంలలో కోవిడ్‌ కోవిడ్‌ కేసులు నమోదు కాలేదు. కానీ ఈ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న కేరళ రాష్ట్రంలో కాసర్‌గోడ్‌ జిల్లాను మాత్రమే షట్‌డౌన్‌ ప్రకటించి, మిగతా జిల్లాల్లో ఆంక్షలు విధించింది. మొత్తానికి కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

Next Story