కరోనా కంటపడని దేశాలివే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 April 2020 4:55 AM GMT
కరోనా కంటపడని దేశాలివే..

కరోనా గురించి చెప్పినప్పుడల్లా ప్రపంచమంతా విస్తరించింది అన్న మాట చాలా సులువుగా చెప్పేస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక దేశాలు కరోనా భూతంతో ఎడతెగని పోరు సాగిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా కరోనా ఉనికి ఉంటూనే ఉంది. అగ్రరాజ్యాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సైతం ఈ మహమ్మారితో సతమతమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా కనిపించని ప్రాంతం ఏదైనా ఉంటే నిజంగా అది అదృష్టమే. అయితే, ఒకటి కాదు, రెండు కాదు అనేక దేశాల్లో కరోనా లేదని జాన్ హాప్ కిన్స్ వర్సిటీ డేటా చెబుతోంది.

కొమోరోస్, కిరిబాటి, లెసోతో, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా దీవులు, నౌరు, ఉత్తర కొరియా, పలావ్, సమోవా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపె, సోలోమాన్ దీవులు, దక్షిణ సూడాన్, టోంగా, తుర్కెమెనిస్థాన్, టువాలు, వెనువాటు, యెమెన్ దేశాలు కరోనా రహిత దేశాలని హాప్ కిన్స్ వర్సిటీ పేర్కొంది. అత్యధిక దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే చిన్న చిన్న దీవులు. మరికొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలు కరోనా రహిత దేశాల జాబితాలో ఉన్నాయి. నిజానికి వీటిలో చాలా ప్రదేశాలు పేర్లు మనకు తెలియనే తెలియదు.

ఉత్తర ఫసిపిక్ లోని పలావు ద్వీపాన్నే చూద్దాం.. ఇక్కడ మెుత్తం 18వేల మంది జనాభా నివసిస్తున్నారు. కానీ ఈ ద్వీపంలో ఇప్పటివరుకు ఒక్క కోవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదుకాలేదు. పొరుగున ఉన్న ప్రాంతాన్నికి టన్నుల కిలోమీటర్ల దూరంలో పలావు ద్వీపం చుట్టూ ఫసిపిక్ మహాసముద్రం ఉంది. ఈ ద్వీపం కూడా వైరస్ ను అరికట్టేందుకు పలావు నుంచి తాహితీ ప్రాంతం వరకు ప్రయాణ సదుపాయాన్ని నిలిపివేసింది. పాఠశాలను మూసివేసింది. అంతేకాకుండా లాక్ డౌన్, అత్యవసర సమయాల్లో కావాల్సిన నియమాలను కూడా అమలు చేసింది.

అలాగే సమోవా, తుర్క్మెనిస్తాన్, ఉత్తరకొరియా, అంటార్కిటికా ప్రాంతాలు మంచుతో కూడినవి. అయినా సరే ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఒక్క కేసు నమోదుకాలేదు. ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాల్లోను, బోట్స్ వానా , ల్యాండ్ లాక్ లెసోతో దేశాలు దక్షిణాఫ్రికా సరిహద్దులో ఉన్నప్పటికీ ఒక్క కోవిడ్ 19 కేసును నమోదు చేయలేదు.

ఈ దేశాలకు ఇతర దేశాలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం కరోనా అక్కడ ప్రవేశించకపోవడానికి ప్రధాన కారణం. ఉన్న రవాణా సదుపాయాలను కూడా ఆపేసుకున్న కారణంగా ఈ దేశాలు కరోనా బారిన పడకుండా తమని తాము కాపాడుకుంటున్నాయి.

Next Story