క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1975 కేసులు న‌మోదు కాగా.. 47 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేసింది. తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 26,917 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 826 మంది ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి మృత్యువాత ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 5,913 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 20,177 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దేశంలో అత్య‌ధికంగా మ‌హ‌రాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో 7,628 కేసులు న‌మోదు కాగా త‌రువాత గుజ‌రాత్ 3,071 కేసుల‌తో రెండో స్థానంలో ఉంది. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో 2,625, రాజస్థాన్‌లో 2,083, మ‌ధ్య ప్ర‌దేశ్‌లో 2,096, యూపీ1,843, త‌మిళ‌నాడు 1,821, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లొ 1,097 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.