విదేశాల నుంచి దేశానికి 15 లక్షల మంది..హైదరాబాద్ కు 55 వేల మంది..

By రాణి  Published on  27 March 2020 12:41 PM GMT
విదేశాల నుంచి దేశానికి 15 లక్షల మంది..హైదరాబాద్ కు 55 వేల మంది..

ముఖ్యాంశాలు

  • దేశంలో 700కు పైగా కరోనా కేసులు
  • ఒక్క మహారాష్ట్రలోనే 130 దాటిన కేసుల సంఖ్య
  • తెలంగాణలో ఒక్కరోజే 10 కరోనా కేసులు
  • డేంజర్ బెల్స్ మోగకుండా..జాగ్రత్త పడాలి

కరోనా వైరస్.. ప్రస్తుతం ఐరోపా దేశాలన్నింటినీ గడగడలాడిస్తోంది. నిజానికి ఈ వైరస్ పుట్టిన చైనా కంటే ఇప్పుడు అమెరికాలోనే ఎక్కువమంది బాధితులున్నారు. ఇప్పటివరకూ అమెరికాలో 83 వేల మందికి పైగా కరోనా బారిన పడి ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. ఇటలీలో మాత్రం వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 7 వేలకు చేరింది. స్పెయిన్ లో కూడా వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఒక్కరోజులోనే 700 పైగా బాధితులు అశువులు బాశారు. ఇరాన్, ఇరాక్, రష్యా వంటి దేశాల్లో వైరస్ రోజులు గడిచే కొద్దీ తీవ్ర రూపం దాల్చుతోంది.

Also Read : నా అన్న మన్నెం దొర..అల్లూరి సీతారామరాజు

ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 750కి చేరువలో ఉంది. 17 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 130కి పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో కూడా వైరస్ బాధితుల సంఖ్య 100 దాటింది. తెలంగాణలో 59 మందికి వైరస్ సోకితే..ఒకరికి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 12 మంది వైరస్ బాధితులు ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డాక్టర్లకు వైరస్ లక్షణాలుండటంతో వారిని క్వారంటైన్ లో ఉంచారు.

ఇండియాలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందడానికి అసలు కారణం ఏంటి ? విదేశాల నుంచి ఇండియాకి వచ్చినవారిని వచ్చినట్లుగానే 14 రోజులు క్వారంటైన్ లో ఉంచి పంపారు. వారిలో వైరస్ లక్షణాలు కనిపించిన వారిని ఆస్పత్రులకు తరలించారు. మరి 700 మందికి పైగా వైరస్ సోకడం వెనుక కారణమేంటన్నది తెలుసుకోవాల్సి ఉంది. నిజానికి విదేశాల్లో కరోనా వ్యాపిస్తున్నప్పటి నుంచి అంటే జనవరి 18 నుంచి మార్చి 23వ తేదీ వరకూ.. అక్కడున్న విద్యార్థులు, ఉద్యోగులు ముందే అప్రమత్తమై ఇండియాకు చేరుకున్నారు. మొత్తం 15 లక్షల మంది ఇండియన్లు విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 55 వేలమంది హైదరాబాద్ కు చేరారు. కొంతమంది విమాన మార్గం ద్వారా వస్తే..మరికొంతమంది క్వారంటైన్ తప్పించుకోవడానికి ఢిల్లీ నుంచి రైలు మార్గాల ద్వారా చేరుకున్నారు. అలా చేరుకున్నవారిలోనే కరీంనగర్ లో తిరగాడిన ఇండోనేషియన్లు కూడా ఉన్నారు.

Also Read : మూడు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బన్నీ

విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు కానీ..రైల్వే స్టేషన్లలో చేయలేదు. ఎందుకంటే విదేశాల నుంచి రైలు మార్గాల ద్వారా ఎక్కువమంది వచ్చే అవకాశాలు లేవు కాబట్టి. ఎక్కువమంది రానక్కర్లేదు. వైరస్ ఉన్నవాడు ఒక్కడు రైలు ప్రయాణం చేసినా..ఆ వైరస్ కొన్ని వందల మందికి, తర్వాత వేలు, లక్షలు, కోట్ల మందికి సోకే ప్రమాదముంది. అదే రైల్వే స్టేషన్ లో కూడా స్క్రీనింగ్ చేసి, కరోనా లక్షణాలున్నవారిని క్వారంటైన్ కు తరలించి ఉంటే ఇన్ని వందలమంది కరోనా బారిన పడేవారు కాదు.

ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో కొందరు విదేశాల నుంచి వస్తే..మరికొందరికి సామాజిక వ్యాప్తి ద్వారా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు 55 వేల మంది విదేశాల నుంచి వస్తే..ఇప్పటి వరకూ వారిలో ఎంతమందికి వైరస్ వ్యాపించి ఉంటుంది ? వారి ద్వారా ఇంకెంత మందికి వైరస్ సోకుతుంది ? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. క్వారంటైన్ లో ఉండి వచ్చిన వారికి వైరస్ ఎందుకొస్తుంది అని మాత్రం అనుకోకండి. క్వారంటైన్ సెంటర్లలో 14 రోజులు ఉండి ఇంటికొచ్చేస్తారు. 15వ రోజు వారిలో కరోనా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కరోనా భూతం ఒక మనిషిలోకి ప్రవేశించాక..14 రోజుల పాటు ఆ మనిషి మామూలుగానే ఉంటాడు. 15వ రోజు నుంచి జలుబు, పొడిదగ్గు, విపరీతమైన జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలు కనిపించే అవకాశముంది. వీరి ద్వారా కుటుంబ సభ్యులకు, కుటుంబ సభ్యుల ద్వారా కాలనీ వారికి, వారి ద్వారా నగరానికి, రాష్ట్రానికి వైరస్ సోకే ప్రమాదముంది. అందుకే మీ ఇంట్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చి..క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకున్నా..మళ్లీ ఒకసారి వారికి కరోనా పరీక్షలు చేయించడం ఉత్తమం.

Also Read : భారీ కాయాన్ని చూసి షాక్ కొట్టిన పిట్టల్లా..నగ్నంగా చూస్తుండగానే..

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం వరకూ రోజుకు 2-3 కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా 10 కేసులు నమోదవ్వడంతో కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు ముగిసేంత వరకూ మీరు ఇళ్లకే పరిమితమవ్వడం మంచిది. ఇంట్లో నిత్యావసరాల కోసం ఒక్కరే వెళ్లి తెచ్చుకోవాలి. బయటికి వెళ్లేటపుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి.

Next Story