భారత దేశంలో కరోనా కోరలు చాచింది. రోజులు గడిచే కొద్దీ..రోజుకి 100 కరోనా కేసులు పైగానే నమోదవుతున్నాయి. శుక్రవారానికి భారత్ లో 724 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణలో 45, ఆంధ్రాలో 11 కేసులున్నాయి. దేశ వ్యాప్తంలో 67 మంది కరోనా బాధితులు కోలుకోగా..17 మంది మృతి చెందారు.

Also Read : మళ్లీ పెరిగిన ఉల్లి ధర

కరోనాతో పోరాడేందుకు టాలీవుడ్ తారాగణం కదిలింది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర సహాయ నిధికి తమ వంతు విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్ర, తెలంగాణతో పాటు కేరళ రాష్ట్రానికి కూడా విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బన్నీ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.కోటి 25 లక్షలు విరాళమిస్తున్నట్లు తెలిపారు.

Also Read : సారీ బ్రదర్..అది జక్కన్న ఇస్తానన్నారు

అలాగే అందరం ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు. కరోనా తగ్గేంతవరకూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ శానిటైజర్లు, మాస్క్ లు వాడాలని సూచించారు. అనవసరంగా బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు బన్నీ.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.