ఇండియాలో డేంజర్ బెల్స్..కరోనా @840

By రాణి  Published on  27 March 2020 1:56 PM GMT
ఇండియాలో డేంజర్ బెల్స్..కరోనా @840

భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. శుక్రవారం ఉదయానికి 724 కరోనా కేసులుండగా..సాయంత్రానికి ఈ సంఖ్య 840కి చేరింది. అంటే 12 గంటల్లోపు 100 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కేరళలో శుక్రవారం ఒక్కరోజే 39 కొత్త కరోనా కేసులను గుర్తించారు వైద్యులు. తెలంగాణలో కూడా కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 2 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5లక్షలు దాటాయి. ఇప్పటి వరకూ 22 వేల మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు.

Also Read : బ్రిటన్ లో కోరలు చాచిన కరోనా..ప్రధానిని సైతం వదలని భూతం

రాష్ట్రాల వారీగా చూస్తే..కేరళలో 176 కేసులు, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55, తెలంగాణలో 59, గుజరాత్ 43, రాజస్థాన్ 41, యూపీ 41, తమిళనాడు 35, ఢిల్లీలో 36, పంజాబ్ లో 33, మధ్యప్రదేశ్ 20, ఏపీలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. దీనిని బట్టి రాష్ట్రంలో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ 15 వరకూ ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండక తప్పదన్నారు సీఎం కేసీఆర్. కరోనాను జయించేందుకు ప్రస్తుతం మనముందున్న మార్గం ఇదొక్కటేనని సూచించారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నా..దయచేసి ఎవరూ బయటికి రాకండంటూ కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఇరానియన్ల హల్ చల్

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన మహిళ కర్ణాటకలోని బంధువుల ఇంట్లో ఉంటూ..కరోనాతో మృతి చెందింది. ఇటీవలే ఆమె మక్కా నుంచి వచ్చింది. ఆ మహిళను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మక్కా నుంచి రాగానే ఆమె హిందూపురం నుంచి బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనాతో మహిళ మృతితో..ఆమెతో పాటు వచ్చిన 900 మందినీ మళ్లీ క్వారంటైన్ కు తరలించనున్నారు అధికారులు. మరోవైపు కర్నూల్ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది.

Next Story