బ్రిటన్ లో కోరలు చాచిన కరోనా..ప్రధానిని సైతం వదలని భూతం

By రాణి  Published on  27 March 2020 12:57 PM GMT
బ్రిటన్ లో కోరలు చాచిన కరోనా..ప్రధానిని సైతం వదలని భూతం

కరోనా వైరస్.. దీనికి గొప్ప, బీద తేడాలేదు. సామాన్యుడా, సెలబ్రిటీనా, రాజకీయ నాయకుడా అన్న వ్యత్యాసం తెలీదీ వైరస్ కి. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణయింది. ఈ విషయాన్ని బోరిస్ స్వయంగా తెలిపారు. గురువారం ఆయనకు కరోనా లక్షణాలతో తీవ్రంగా బాధపడ్డాడనని, కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకోగా..పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు బోరిస్. ఇకపై తాను స్వీయ నిర్బంధంలో ఉంటానని తెలిపారు. అలాగే దేశ పాలన పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్ లో ఉంటానని పేర్కొన్నారు.

Also Read : విదేశాల నుంచి దేశానికి 15 లక్షల మంది..హైదరాబాద్ కు 55 వేల మంది..

ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రధాని కార్యాలయ వర్గం తెలిపింది. అయితే బ్రిటన్ ప్రధాని కన్నా ముందు మార్చి 11న ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరిస్ కు కరోనా నిర్థారణ అయింది. ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా సోకింది. దీనిని బట్టి సాధారణ ప్రజలే కాదు..ఎంత పలుకుబడి, డబ్బు, స్థానం ఉన్నవారైనా కరోనా నుంచి కాపాడుకునేందుకు కనీస జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలుస్తోంది.

Also Read : అధికార పార్టీ ప్రజాప్రతినిధికి కరోనా..? గుంటూరులోని పలు కాలనీల్లో అలర్ట్‌

Next Story