అసలే కరోనా కాలం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విదేశీయులను చూసినా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారిని అంటరానివారిగా చూస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ విధించారు. సాయంత్రం 6-7 గంటల నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ విధించారు. మనవాళ్లు ఈ నిబంధనలను పాటిస్తున్నప్పటికీ..విదేశాల నుంచి వచ్చినవారు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం రెండు ప్రాంతాల్లో ఇరానియన్లు కనిపించారు.

Also Read : విదేశాల నుంచి దేశానికి 15 లక్షల మంది..హైదరాబాద్ కు 55 వేల మంది..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల చెక్ పోస్ట్ వద్ద ఇరానియన్లు పోలీసులతో గొడవకు దిగారు. తమను తెలంగాణలోకి అనుమతించాలంటూ వాగ్వాదమాడారు. తిట్టారు కూడా. ఇంతలో మీడియా కెమెరా కనిపించడంతో కిక్కురుమనకుండా ఉండిపోయారు. వారికి కరోనా ఉందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. వెంటనే టెస్టులు చేయించుకోమని సూచించారు.

Also Read : బ్రిటన్ లో కోరలు చాచిన కరోనా..ప్రధానిని సైతం వదలని భూతం

ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇరానియన్లు తిరగాడారు. పోలీసులు వారిని ఆరా తీయగా ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థులని తేలింది. బయట ఎక్కువగా తిరగవద్దని సూచించారు. వారిని కూడా వెంటనే కరోనా టెస్టులు చేయించుకోమని కోరారు. ఇలాంటి సమయంలో విదేశీయులను చూస్తే మనవాళ్లు కొట్టినంత పని కూడా చేస్తున్నారు. కేవలం భారత్ ను నాశనం చేసేందుకు వీరు ఇక్కడికి వచ్చారన్నట్లు చూస్తున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story