ఏపీలో కొత్త‌గా 75 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2020 9:10 AM GMT
ఏపీలో కొత్త‌గా 75 కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 3,775 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 75 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో చిత్తూరులో అత్య‌ధికంగా 25 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 20, క‌ర్నూలులో 16 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి.

కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 722 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 20 మంది మ‌ర‌ణించారు. మొత్తం కేసుల్లో 92 మంది చికిత్స అనంత‌రం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లగా.. 610 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Corona cases in AP

Next Story
Share it