శభాష్: కరోనాను జయించిన పసికందు
By సుభాష్ Published on 30 April 2020 11:06 AM ISTముఖ్యాంశాలు
► పుట్టిన 23 రోజులకే కరోనా
► తల్లికి నెగిటివ్ - బిడ్డకు పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. చాపకింద నీరులా దేశ దేశాలకు సైతం వ్యాపిస్తోంది ఈ వైరస్. ఇక గాంధీ ఆస్పత్రి వైద్యుల కృషితో ఓ పసికందు కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. 20 రోజుల కిందట కరోనాతో సోకిన తన బిడ్డతో ఆస్పత్రిలో చేరిన ఆ తల్లికి 'డాక్టరోంకో.. ఔర్ తెలంగాణ సర్కార్‌కో షుక్రియా ఆదా కర్తీహూ' అంటూ ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్లింది.
పుట్టిన 23 రోజులకే కరోనా సోకగా, 21 రోజుల పాటు పోరాడి విజయం సాధించాడు ఆ బుడ్డొడు. కరోనా సోకిన వారిలో దేశంలోనూ అతిపిన్న వయస్కుడిగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహబూబ్‌నగ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతడికి వైరస్ సోకింది. దీంతో అతనికి 23 రోజులు కుమారుడికి విరేచనాలు కావడంతో వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే శిశువులో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. ఇక తల్లికి కూడా పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కరోనా నెగిటివ్ తేలింది.
ఇక పసికందుకు పాజిటివ్ ఉండటంతో ఈనెల 10వ తేదీన గాంధీ ఆస్పత్రికి తరలించారు. 19 రోజుల పాటు వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు ఈ శిశువుతో పాటు 12 ఏళ్లలోపు చిన్నారులు మరో 13 మందిని కూడా డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఇప్పటి వరకూ సుమారు 95 మంది చిన్నారులకు కరోనా సోకగా, పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.