దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో రాష్ట్రంలో కొన్ని కరోనా ఫ్రీ జిల్లాలుగా మారనున్నాయి. కేసులు తగ్గిపోయి పాజిటివ్‌ కేసులు లేకుండా 11 జిల్లాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

కరోనా ఫ్రీ జిల్లాలు

కాగా, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్‌‌, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, పెద్దపల్లి, భద్రాది కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాల్లో కరోనా యాక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1016 మంది కరోనా మహమ్మారి బారినపడగా, బుధవారం కరోనా నుంచి కోలుకుని 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తుండగా, ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *