నిర్భయ దోషుల మృతదేహాలకు కాసేపట్లో పోస్ట్ మార్టం
By సుభాష్ Published on 20 March 2020 7:14 AM IST![నిర్భయ దోషుల మృతదేహాలకు కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్భయ దోషుల మృతదేహాలకు కాసేపట్లో పోస్ట్ మార్టం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/Convicts-postmortem.jpg)
నిర్భయ కేసులో నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరి తీసిన అనంతరం వైద్యులు పరిశీలించి మరణించినట్లు ధృవీకరించారు. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు నలుగురు దోషులైన పవన్ గుప్త (25), అక్షయ్ కుమార్ (30), వినయ్ శర్మ (26), ముఖేష్‌సింగ్ (32)లను ఉరి తీసిన తర్వాత 30 నిమిషాల పాటు ఉరి కంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం డీడీయు ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు దోషుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
కాగా, 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా, అందులో ఒక నిందితుడు 2013లో జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొక నిందితుడు బాలనేరస్తుడిగా భావించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించి అనంతరం విడుదల చేశారు.