ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

By సుభాష్  Published on  17 Feb 2020 3:45 PM GMT
ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ధర్నాకు దిగింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల తీరు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ హక్కు కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు దీనిపై ఆందోళన చెందుతున్నాయని అన్నారు. దళితున్ని సీఎం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేబినెట్‌లో ఒక్క మాదిగకు చెందిన మంత్రి కూడా లేడని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్‌, గిరిజన విషయాన్ని టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌లో ఒక్క రోజు కూడా మాట్లాడాలేదని దుయ్యబట్టారు. గిరిజన రిజర్వేషన్‌కు పది శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అలాగే ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడనికి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా వ్యహరిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ను గిరిజన వ్యతిరేకి అని ముద్రవేయాల్సిన అవసరముందన్నారు.

Next Story