సుశాంత్ కు న్యాయం జరుగుతుంది.. పలువురు ప్రముఖుల స్పందన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 1:37 PM IST
సుశాంత్ కు న్యాయం జరుగుతుంది.. పలువురు ప్రముఖుల స్పందన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) జూన్ 14న ముంబై అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా, పట్నా పోలీసులు జూలై 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో నిజం రావాలంటే సీబీఐకి కేసును అప్పగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ మొదలైంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆహ్వానించారు. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, కృతి సనన్, అనుపమ్ ఖేర్, అంకిత లోఖండే, ఏక్తా కపూర్ లాంటి ప్రముఖులు సీబీఐ విచారణ జరగాలని.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలంటూ చెప్పుకొచ్చారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు సీబీఐ విచారణలో న్యాయం జరుగుతుందని అన్నారు.

సుప్రీం కోర్టు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై విచారణకు ఆదేశించింది. నిజం బయటకు వస్తుంది అంటూ అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.



సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలని పోరాడుతున్న వారందరికీ కృతజ్ఞతలు.. న్యాయం జరుగుతుంది అని తప్పకుండా నమ్మకం కలుగుతోంది అని కంగనా రనౌత్ స్పందించింది.



సుప్రీం కోర్టు సుశాంత్ మరణం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా అతడికి న్యాయం జరుగుతుందని ఆశలు చిగురిస్తున్నాయని తెలిపింది కృతి సనన్.



ఇదొక పాజిటివ్ స్టెప్ గా అనిపించిందని.. సీబీఐ తన పని తాను చేసుకుంటుందని.. ఎవరికి వారు వారి ఊహాగానాలను పక్కన పెట్టాలని పరిణీతి చోప్రా తెలిపింది.



సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే నిజం తప్పకుండా గెలుస్తుందని చెబుతూ న్యాయదేవత ఫోటోను పోస్టు చేశారు.



Next Story