సెల్ఫీ పిచ్చి ఆ అమ్మాయి 'ప్రాణం' తీసింది.!

By Medi Samrat
Published on : 11 Nov 2019 12:42 PM IST

సెల్ఫీ పిచ్చి ఆ అమ్మాయి ప్రాణం తీసింది.!

ముఖ్యాంశాలు

  • ప్రాణం తీసిన సెల్ఫీ స‌ర‌దా
  • ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోగా మృతి

సెల్ఫీ పిచ్చితో బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు కోల్పో యింది. వివరాళ్లోకెళితే.. నరసరావుపేట పట్టణం వెంగళ్‌ రెడ్డినగర్‌కు చెందిన ఐలా ధనలక్ష్మీ(20) స్నేహితులతో కలిసి కండ్లగుంటకు బయలుదేరింది. కొంత‌దూరం రాగానే గుంటూరు బ్రాంచ్‌ కెనాల్ వంతెనపై సెల్పీ తీసుకోవాలనుకుంది. స్నేహితుడితో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ కాలువలో పడిపోయారు.

ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే.. ముఖేశ్‌ ప్రాణాలతో బయటపడగా.. ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చేలోపు తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్ప‌టికే మృతిచెందింది.

Next Story