కుప్పకూలిన గోల్కొండ కోట ప్రహారీ గోడ..
By సుభాష్ Published on 17 Oct 2020 5:45 AM GMTహైదరాబాద్‌లో రెండు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి. మూసి నది వందేళ్ల తరువాత పోటెత్తింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే, ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఆ గోడ కుప్పకూలిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story