సీఎం రమేష్‌కు కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2020 12:09 PM ISTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యం భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నా-పెద్ద, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో.. పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు.
Next Story