కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి

By సుభాష్  Published on  17 Jun 2020 7:49 AM GMT
కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు. తాజాగా భారత్‌లో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే వారు ఎందరినో కలుస్తుంటారు. వారిని ఎందరో కలుస్తుంటారు కాబట్టి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పీఏ దామోదరం బుధవారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.

ఇక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,974 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,54,065కు చేరింది. కాగా, నిన్న ఒక్క రోజే 2003 మంది మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 11,903కి చేరింది. అలాగే భారత్‌లో డెత్‌ రేటు 2.9శాతం నుంచి 3.4శాతానికి పెరగడం గమనార్హం. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 1,86,934 మంది డిశ్చార్జ్‌ కాగా, 1,55,227 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్యను చూస్తే.. భారత్‌ 4వ స్థానంలో ఉంది.

Next Story
Share it