'ధరణి' పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 8:17 AM GMT
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్ట‌ల్‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. అంత‌కుముందు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మేడ్చ‌ల్ జిల్లా మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మోసాలకు ఆస్కారం లేని.. గందరగోళం అనే మాటే వినపడకుండా.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్ చేసుకుని‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు.. అంతా ఆన్‌లైన్‌లోనే జ‌రిగే విధంగా.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం చేస్తూ.. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు అందే విధంగా.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భూమి వివరాలు తెలుసుకునే విధంగా.. రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ‘ధరణి’ అందుబాటులోకి వ‌చ్చిందని అన్నారు.

Next Story